కేతేపల్లి, అక్టోబర్ 27: సీఎం కేసీఆర్‌తోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఇనుపాముల, బండపాలెం, కొండకిందిగూడెం గ్రామా ల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి కేసీఆర్‌కు అండగా నిలవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధిక సంఖ్యలో భారీ ర్యాలీ గా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలతాసురేశ్, సర్పంచులు జాల వెంకట్‌రెడ్డి, వంగూరి జయమ్మ, గోలి మంజులావేణుమాధవరెడ్డి పాల్గొన్నారు.
కట్టంగూర్ : గతంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మండలంలోని చెర్వుఅన్నారం, గార్లబాయిగూడెం, కురుమర్తి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎన్నికలల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిందన్నారు. తొమ్మిదున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు మీకు సేవకుడిగా ఉంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, ఆయా గ్రామాల సర్పంచులు నంద్యాల చైతన్య నర్సిరెడ్డి, బోడ సరితాయాదగిరి, గుర్రం సైదులు, ఎంపీటీసీ బీరెల్లి రాజ్యలక్ష్మీప్రసాద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుందారపు వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైద్దిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ గద్దపాటి శంకర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గుండగోని రాములు, నాయకులు ఎడ్ల చిన రాములు, పొడిచేటి సైదులు, ఆవుల సైదులు, పాల్వాయి లింగారెడ్డి, అంతయ్య పాల్గొన్నారు.