మిర్యాలగూడ, మే 14 : రాజకీయ కక్షలతో తమ ఇండ్లపై కొందరు దాడికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. బాపూజీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌యాదవ్, దుర్గాచారి, శ్యామ్, క్రాంతి, జనార్దన్, శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు.
అదేకాలనీలో నివాసం ఉంటు న్న పాతూరి ప్రసాద్, పాతూరి మురళి, అఖిల్, వెంకటేశ్వర్రావు, శరత్, శ్రీనివాస్, సాయి, రవి తమ ఇండ్లపై అర్ధరాత్రి కర్రలు, కొడవళ్లతో దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కాలనీలో ఉంటే చంపుతామని ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్లిపోవాలని ఇండ్లలోకి వచ్చి కర్రలతో దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు. వారి వల్ల తమకు ప్రాణాలకు అపాయం ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.