నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఓటమి భయంతో కాం గ్రెస్ పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. దాడు లు, దౌర్జన్యాలకు తెరలేపుతూ విచ్చలవిడిగా దొంగ ఓట్లకు పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఓటర్ల పేరుతో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి దొంగ ఓట్లను ప్రోత్సహించారు. దీంతో నల్లగొండ, మిర్యాలగూడ, హాలి యా, నందికొండ మున్సిపాలిటీ పరిధిలో దొంగ ఓట్లను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.
దొంగ ఓటర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించినా ఫలితం లేకపోయింది. వారు పక్కకు తీసుకెళ్లి వదిలేయడంతో బీఆర్ఎస్ నేతలు, అభ్యర్థులు పోలీసుల తీరుపై తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రోడ్డపై బైఠాయించి నిరసనకు దిగారు. మిర్యాలగూడలో యువనేత నల్లమోతు సిద్ధార్థ దొంగ ఓట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏకంగా కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. ఇక్కడ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లను అడ్డుకున్నారన్న కోపంతో పోలింగ్ ముగిశాక ఏజెంట్లు బయటకు రాగానే వారిపై మూకుమ్మడి దాడి చేశారు.
దీంతో పలువురు బీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలకు తీవ్ర గాయలయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరగ్గా పలు వార్డుల్లో కాంగ్రెస్ నేతలు గెలుపు కోసం బరి తెగించారు. ప్రచారం ముగిసిన తర్వాత నుంచి రెండు రోజులుగా విచ్చలవిడిగా డబ్బు, మద్యం, ఖరీదైన గిఫ్టులు పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. బుధవారం పోలింగ్ రోజున ఓట్ల కోసం అడ్డదారులు తొక్కేందుకు యత్నించారు. వీరి ఆగడాలను అడుగడుగునా బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి.