– మున్సిపల్ ఎన్నికల వేళ ఊపందుకున్న చేరికలు
– గులాబీ తీర్థం పుచ్చుకున్న 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
– ఆహ్వానించిన బడుగుల లింగయ్య యాదవ్, నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, జనవరి 28 : మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ జోష్ కొనసాగుతోందని మున్సిపోల్స్ మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డి కాలనీలో గల పార్టీ కార్యాలయంలో 18వ వార్డు – సుందర్ నగర్ నుండి పెద్ది శ్రీనివాస్ గౌడ్, గుంజ కొండల్, మల్లేష్ ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ పట్టణంలోని అనేక వార్డుల నుండి పోటీ చేసే అభ్యర్థులు దొరక్క కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో వరుస చేరికలు కొనసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ జోరు చూస్తుంటే రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కార్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై నమ్మకంతో, గతంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు ఫలితంగా రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వైపునకు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అన్నారు. బీఆర్ఎస్ తోనే మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వారు సూచించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందన్నారు. అంతా కలిసికట్టుగా శ్రమించి మిర్యాలగూడ పుర పీఠంపై గులాబీ జెండా ఎగురవేయలని కోరారు.
ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలని, బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్దార్థ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వల్లంపట్ల వినోద్, గుంజ శ్రీనివాస్, చింతకుంట్ల చాంద్, గుడుగుంట్ల కిశోర్, పందిరి అరుణ్, కుర్ర రాజు, దండెం మధు, పెండ్ర నాని, మడప సాయిరాం, అనుముల సైదులు, పెండ్ర అశోక్, పెండ్ర మహేశ్, పెండ్ర ఉపేందర్, మేలగర కృష్ణ కుమార్, మస్తాన్, నాగుల్ మీరా పాల్గొన్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ జోష్