దేవరకొండ రూరల్ : దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన బుడిగ లచ్చయ్య మృతి బాధాకరం అని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ముదిగొండ గ్రామంలో లచ్చయ్య మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. లచ్చయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మాజీ ఎంపీటీసీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, జైహింద్ రెడ్డి, రేపాని ఇద్దయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.