Gadari Kishore | తుంగతుర్తి : ఈ నెల 27న వరంగల్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ కోరారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభ పోస్టర్ ను ఆవిష్కరించరు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్ల ప్రభుత్వ హయాంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించమని రాష్ట్రాన్ని కెసిఆర్ నాయకత్వంలో సస్యశ్యామలంగా తీర్చిదిద్దామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయామని తెలుసుకున్నారని రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయితున్న సందర్భంగా వరంగల్ లో నిర్వహించే రజతోత్సవ మహాసభకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో బయలుదేరి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, గుండగాని రాములు గౌడ్, కలేట్లపల్లి ఉప్పలయ్య, గోపాల్ రెడ్డి, గాజుల యాదగిరి, సత్యనారాయణ, మట్టిపల్లి వెంకట్, బొంకురి శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.