చండూరు, నవంబర్ 05 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. బుధవారం బీఆర్ఎస్ చండూరు మండల నాయకులు హరీశ్‌రావును ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించారు. సత్యనారాయణ రావు పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిలువేరి నరేశ్, ఎండీ.మహమూద్, తిప్పతి కృష్ణయ్య, సూరం శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున రామాచారి, నీలకంఠం వెంకటయ్య, ఆలేటి భిక్షం, చిలువేరు సురేశ్, పులికరం లింగస్వామి, గాజులబోయిన జగన్, అచ్చుత చారి, పర్సనబోయిన మహేశ్, నీరుడు కృష్ణ, నాగార్జున, కోటాచారి, పర్సనబోయిన సైదులు, మండల లింగస్వామి, పర్సనబోయిన శ్రీను పాల్గొన్నారు.