ఆలేరు టౌన్, జూలై 23: హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును ఆలేరు బీఆర్ఎస్ మండల, పట్టణ కమి టీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలేరు మున్సిపాల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్యతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు శాలువాతో హరీశ్‌రావును సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన వారిని కడుపులో పెట్టుకొని కన్నబిడ్డలుగా పార్టీ చూసుకుంటుందన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం వల్ల రైతులు నష్టపోయి, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు గాక తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మళ్లీ రాష్ర్టాంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 1న యాదగరిగుట్ట గిరిప్రదక్షిణకు వస్తానని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపాల్ చైర్మన్ వస్పరి శం కరయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం, మాజీ ఏఎంసీ చైర్మన్ గ్యాధపాక నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు కొలుపుల హరినాథ్, సిరిగిరి విద్యాసాగర్, ఆరుట్ల లక్మీప్రసాద్రెడ్డి, కందుల రామన్న, సముద్రాల కుమార్, మోర్తాల రమణారెడ్డి, ఎండీ జమాల్, కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొంటా..!
యాదగిరిగుట్ట, జూలై 23: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా అగష్టు 1న నిర్వహించే గిరప్రదక్షిణలో పాల్గొంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా బుధవారం మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ఆయనకు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఆలేరు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయనను బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేసి శెల్లాను అందజేశారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని ఆహ్వానించారు. దీంతో స్పందించిన ఆయన తప్పకుండా పాల్గొంటానని హామీనిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి గెలుపు దిశగా పనిచేయాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత సంతరించుకుందన్నారు. జడ్పీ చైర్మన్, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీ సీట్ల అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందే అవకాశం ఉందన్నారు .
సమర్థవంతమైన అభ్యర్థిలను ఎన్నుకొని ప్రజలకు అండగా నిలిచే విధంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, మాజీ కౌన్సిలర్ ఆవుల సాయియాదవ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ సర్పంచులు తోటకూరి బీరయ్య, ఆరే మల్లేశ్‌గౌడ్, మొగిలిపాక రమేశ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్ రేపాక స్వామి, మాజీ ఎంపీటీసీ బీర్ల మహేశ్, నాయకులు పాండవుల భాస్కర్‌గౌడ్, బొట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.