దేవరకొండ, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బుధవారం జోరుగా ప్రచారం నిర్యహించారు. పట్టణoలోని 5, 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థినులు జక్కుల రాజేశ్వరి, అoకూరి వాణి ఇంటింటి ప్రచారం నిర్యహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్పా మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ ఇప్పటి వరకు అమలు కాని విషయాన్ని ప్రజలు గుర్తించి బీఆర్ఎస్ను గెలిపించాల్సిందిగా కోరారు.