తుంగతుర్తి, జూన్ 13 : ఈ నెల 15న అర్వపల్లిలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎన్ఏ) సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బీఎన్ఏలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇన్చార్జి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిశోర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నిర్ణయించిన బూతు లెవల్ ఏజెంట్లు, సర్పంచులు, ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, సర్పంచ్ కొండగడుపుల ఎల్లయ్య, మండల నాయకులు గోపగాని రమేష్, నాగమల్లు, వెంకటేష్, గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న పాల్గొన్నారు.