చందంపేట, ఆగస్టు 01 : దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ సమావేశం కుర్మేటి ఉమాశంకర్, కుర్మేటి రమా శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం చందంపేట మండలం పెద్దమునిగల్ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కుర్మేటి రవిప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజలంతా వరలక్ష్మి వ్రతాన్ని మూడవ శుక్రవారం అయినా 8 /8 /2025 రోజున జరుపుకోవాలని సూచించారు. అలాగే వినాయక చవితి 27/8/25 బుధవారం రోజున, 5/9/25 శుక్రవారం రోజున గణేష్ నిమజ్జనం నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.
సమావేశంలో సంఘ భవనం కోసం దేవరకొండ శాసనసభ్యుడు నేనావత్ బాలునాయక్ను బ్రాహ్మణులంతా కలవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కుర్మేటి వంశీ కృష్ణ, గారపాటి భాస్కర్ శర్మ, చింతపల్లి శ్రీనివాస్ శర్మ, గొట్టిముక్కల గణేష్ శర్మ, మార్చాల శ్రీనివాస్ శర్మ, కుర్మేటి భిక్షపతి శర్మ, చెరుకుపల్లి అజయ్ శర్మ, ప్రభాకర్ శర్మ, గంపా శశికుమార్, చింతలపల్లి వెంకటేశ్వర శర్మ, నరహరిరావు, నెమళ్ల వెంకట్, సమన్వయకర్త వైద్యుల కృష్ణమూర్తి, తదితర బ్రాహ్మణులు పాల్గొన్నారు.