నల్లగొండ సిటీ జూన్ 11: నల్లగొండ ప్రభు త్వ దవాఖానలో కిడ్నాప్‌నకు గురైన 20 నెలల బాలుడిని సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు 7 గంటలో ఛేదించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టరులో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ..మిర్యాలగూడ మండ లం తుంగపాడుకు చెందిన బైరం అంజిబాబు, భార్య భాగ్యలక్ష్మి దంపతులకు (20) నెలల వయస్సు గల సోమేశ్వర్కుమార్ ఉన్నాడు.
భార్య ప్రస్తుతం 8 నెలల గర్భిణీ కావడంతో ఆమెకు ఆరోగ్యం బాగా లేక ఈనెల 8న చికిత్స కోసం నల్లగొండ ప్రభు త్వ దవాఖానకు భర్త అంజిబాబు కొడుకుతోపాటు ఇంటి పక్కనున్న కుంచం పార్వతమ్మతో కలిసి ప్రభుత్వ దవాఖాన లేబర్ వార్డులో చేరినట్లు తెలిపారు. దవాఖానలో చేరినప్పటి నుంచి భాగ్యలక్ష్మి బాగోగులు ఆమెతో వచ్చిన పార్వతమ్మ చూస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం భాగ్యలక్ష్మి, పార్వతమ్మ ప్రసూతీ విభాగం ఎదుట బాలుడితో ఉన్న సమయంలో అక్క డే ఉన్న ఇద్దరు మహిళలు వారితో పరిచ యం పెంచుకొని బాలుడిని ఆడిస్తున్నట్లు నటిస్తూ బాలుడి తల్లితోపాటు పార్వతమ్మను బాలుడిని చూసుకుంటాం భోజనం చేసి రమ్మని తెలిపారు. దీంతో వారి మాటలు నమ్మి బాలుడిని వారి వద్ద ఉంచి భోజనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి బాలుడిని తీసుకొని పారిపోయారన్నారు.
వారి ఫిర్యాదు మేరకు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో దవాఖానలో ఉన్న సీసీ కెమోరాలతోపాటు బస్టాండ్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా భువనగిరి బస్సులో ఎక్కినట్లు గుర్తించి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ చేసిన దమ్మాయిగూడకు చెందిన నారాయణదాసు అరుణ, జంతిక సుక్కమ్మగా అలియాస్ పాలడుగు సుగుణమ్మగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా నిందితురాలు నారాయణదాసు అరుణ ఆమె తల్లి గారి ఊరైన గుండాల మండలం పెద్దపడిశాలలో బాలుడిని అప్పగించినట్లు తెలిపారు.
నారాయణదాసు అరుణకు ఒక కొడుకు, ఒక బిడ్డ ఉండగా ఆమె కొడుకు సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో మగపిల్లల మీద ప్రేమతో ఏవిధంగనైనా ఒక బాలుడిని తీసుకొచ్చి పెంచుకోవాలని దురాలోచనతో ఇంటి పక్కన ఉన్న జంతిక సుక్కమ్మకు ఈ విషయం చెప్పడంతో ఇరువురు కలిసి నల్లగొండ బస్టాండ్, దవాఖానలో పిల్లలు వారి తల్లిదండ్రులతో ఉంటారని భావించారు.
దీంతో పిల్లల తల్లిదండ్రులు లేని సమయంలో కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు తీసుకరావాలని దురుద్ధేశంతో దవాఖానలో ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి వారిని కోర్టుకు రిమాండ్ చేసినట్టు తెలిపా రు. కార్యక్రమంలో టుటౌన్ సీఐ రాఘవరావు, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, టుటౌన్ ఎస్ఐ సైదులు, ఎస్ఐ సతీస్, భువనగిరి సీఐ రమేశ్, సిబ్బంది రాజు, శంకర్ బాలకోటి జానకిరామ్, తిరుమలేశ్లను ఎస్పీ అభినందించారు.