రామగిరి, ఆగస్టు 02 : నల్లగొండ పట్టణ కేంద్రంలోని యాటకన్నారెడ్డి కాలనీలో గల న్యూస్ స్కూల్లో శనివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే పండుగ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థులకు మన సాంప్రదాయాలు తెలుస్తాయన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు, చిన్నారుల వేషధారణ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ గంట్ల పద్మ, ప్రిన్సిపాల్ అలుగుబెల్లి తిరుమలరెడ్డి, అలుగుబెల్లి స్పందన, ఉపాధ్యాయులు పర్వతరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నగేశ్, రవితేజ, లక్ష్మణ్, ఫాతిమా పాల్గొన్నారు.
Nalgonda : న్యూస్ స్కూల్లో ఘనంగా బోనాలు
Nalgonda : న్యూస్ స్కూల్లో ఘనంగా బోనాలు
Nalgonda : న్యూస్ స్కూల్లో ఘనంగా బోనాలు
Nalgonda : న్యూస్ స్కూల్లో ఘనంగా బోనాలు