– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 29 : 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. గురువారం కేసిఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కోదాడ ప్రధాన రహదారిపై గాంధీ విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో అన్నివర్గాలకు తరతమ భేదాలు లేకుండా సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే, అందుకు భిన్నంగా గాంధీ వారసులమని చెప్పుకునే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలోని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని విమర్శించారు. తుగ్లక్, హిట్లర్ లక్షణాలు కలగలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉందన్నారు. నడిరోడ్డుపై హత్యలు, వేలకోట్ల స్కాములు, దొడ్డి దారిన అవినీతి సంపాదనలతో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాలా తీసిందని విమర్శించారు.
సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి దిక్కు తోచని స్థితిలో ఉద్యమ నేత కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధింపులకు గురిచేసే కుట్రలో భాగమే సీట్ నోటీసులు అన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ బెదరడని, తన ఉద్యమ కాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నింటినో ఆయన చవి చూశారన్నారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఏడ్పడిన వివక్షతను. నీళ్లు, నిధులు, నియామకాల్లో చేస్తున్న దోకాను ఎండగట్టడంతో పాటు వలసలను అరికట్టేందుకు అవిశ్రాంత పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కొనియాడారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా రూపుదిద్దుతుందన్నారు. అలాంటి ఉద్యమ నేతకు అధికారులను తొత్తులుగా చేసుకుని సిట్ తో నోటీసులు ఇప్పించినంత మాత్రాన ఎవరు భయపడరని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు, పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీం, సుంకర అజయ్ కుమార్, శెట్టి సురేష్, చింతల నాగేశ్వరరావు, కర్ల సుందర్ బాబు, గొర్రె రాజేష్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Kodada : ‘ఉద్యమ నేత కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే’
దళిత బిడ్డ రాజేష్ హత్యను నిరసిస్తూ ఈ నెల 24న బీఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా చలో కోదాడ నిర్వహించిందని పేర్కొంటూ ఇచ్చిన నోటీసులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో సమాధానమిచ్చారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించినట్టు ఆయన తన సమాధానంలో వెల్లడించారు.
మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించుకుని గురువారం కోదాడ మున్సిపాలిటీలో 49 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ నుండి 11, బీఆర్ఎస్ నుండి 18, తెలుగుదేశం పార్టీ నుండి 6, బీజేపీ నుండి 5, స్వతంత్ర అభ్యర్థులు తొమ్మిది కలిపి మొత్తం 49 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటి రోజుతో కలుపుకుని 50 నామినేషన్లు దాఖలు అయినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

Kodada : ‘ఉద్యమ నేత కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే’