నీలగిరి, జూన్ 12: ఇటీవల నల్లగొండ పట్టణంలో తెల్లవారుజామున జరిగిన శివసత్తి బోద్ సాయికుమార్ హత్య కేసులో నిందితులను పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు నిందితుల జాడ తెలుసుకున్నారు. తన బృందంతో కలిసి నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లారు. వారిని పట్టుకునే క్రమంలో నిందితులు పోలీసులపై దాడి చేశారు. అక్కడున్న రాళ్లను పోలీసులపై విరసడంతో నల్లగొండ రూర ల్ ఎస్ఐకి గాయాలయ్యాయి. రాళ్లదాడిని తప్పించుకొని నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు.
నిందితులు పోలీసులపై ఆయుధాలతో దాడి చేశారు. ఎస్ఐ సైదాబాబుతో పాటు కానిస్టేబుల్ జానకిరామ్‌లకు గాయాలయ్యాయి. గాయాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు నిందితులను అరెస్టు చేసి నల్లగొండకు తీసుకొచ్చారు. అనంతరం నల్లగొండ ఏఎస్పీ రమేశ్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రా్రష్ట్రంలోని బాఘ్‌పత్ మండలం బదౌత్ గ్రామానికి చెందిన ఫూర్ఖాన్ @ మహేశ్, ఆరిఫ్లు చీరల వ్యాపారం చేసుకుంటూ నల్లగొండకు వచ్చి అమ్ముతుంటారు.
నల్లగొండలోని పెద్దబండకు చెందిన శివసత్తి బోద్ సాయికుమార్(27) గ్రామ దేవతల పండుగలు, ఎల్ల మ్మ పండుగల సందర్భంగా ఆడవేషం ధరించి కొలుపులు చెప్పేవాడు. జీవనోపాధి కోసం నల్లగొండకు వచ్చిన ఫూర్ఖాన్ @ మహేశ్‌కు సాయి కుమార్‌తో పరిచ యం ఏర్పడింది. ఇద్దరూ అప్పుడప్పుడు కలిసి మద్యం తాగేవారు. చీరల వ్యాపా రం నిమిత్తం సాయి కుమార్‌ను రూ.30 వేలు అప్పు ఇవ్వాలని ఫూర్ఖాన్ పలుమార్లు అడిగాడు. డబ్బులు తన వద్ద లేవని తిరసరించడంతో నిందితుడు సాయికుమార్‌పై కోపం పెంచుకున్నాడు. సాయికుమార్ ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను దోచుకోవాలని ఫూర్ఖాన్ పథకం రచించాడు.
తన సహచరుడు ఆరిఫ్‌తో కలిసి మద్య పార్టీ పేరుతో సాయికుమార్‌ను కేశరాజుపల్లి సమీపంలోని వెంచర్‌కు పిలిచారు. వెంటనే ఫూర్ఖాన్, ఆరిఫ్లు కలిసి సాయికుమార్‌పై దాడి చేశారు. సిమెంట్ రాయితో సాయికుమా ర్ తలపై ఫూర్ఖాన్ బలంగా కొట్టాడు. దీంతో సాయికుమార్ అకడికకడే మృతి చెందాడు. మృతుడి ఒంటిపై బంగారు తాయెత్తు, చెవి కమ్మలు, ముకుపుడకలను తీసుకున్నారు. వెండి నగలు రాకపోవడంతో మృతుడి హోండా యాక్టివా సూటీ, ఫోన్ తీసుకొని అకడి నుం చి పరారయ్యారు.
కేసు దర్యాప్తులో పోలీసులు నిందితుల వద్ద నుంచి ఆరు గ్రాముల బంగారం, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో 2టౌన్ సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో తిప్పర్తి ఎస్ఐ శంకర్, రూరల్ ఎస్ఐ సైదాబాబు, ఏఎస్ఐ అఫ్జల్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీను, కానిస్టేబుల్స్ జానకిరాములు, రాంరెడ్డి, సునీల్, గుర్వారెడ్డి, రాజు, ముజ్జు, సైదులు, నాగరాజులను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. సమావేశంలో నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్ఐలు శంకర్, సైదాబాబు, సైదులు ఉన్నారు.