చండూరు : ప్రపంచ రక్తదాతల దినోత్సవం( Blood Donor Day ) సందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపల్ కేంద్రంలోని మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో రివర్ నిమ్స్ ( RIVER NIMS HOSPITALS ) రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు( Chairman Srinivasulu ) ముఖ్యఅతిథిగా హాజరై రక్తదానశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కేంద్రానికి చెందిన పలువురు దాతలు రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలకు యువజన సంఘం తరఫున శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సుష్మా-వెంకన్న, పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు పులిపాటి ప్రసన్న, అధ్యక్షులు గుర్రం బిక్షమయ్య, కోడిగిరి బాబు , పున్న ధర్మేందర్, గంజి శ్రీనివాసులు, రావిరాల నగేష్, గంజి వెంకటేశం, కారింగు రామ్మూర్తి, పన్నాల లింగయ్య, ఇరిగి వెంకన్న, నిర్వాహకులు మార్కండేయ సంఘం సభ్యులు గంజి గంగాధర్, గంజి అశోక్, కలిమికొండ కిరణ్,గంజి బిక్షం,కర్నాటి రవి, బొల్ల శ్రీకాంత్,ఏలె సాయి, చెరిపెల్లి నాగరాజు, గంజి అనిల్ కుమార్, చెరిపెల్లి శివ, కర్నాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.