గుర్రంపోడ్, నవంబర్ 3 : మండలానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డితో మరికొందరు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పాశవారిగూడెం సర్పంచ్ పాశం అలివేలమ్మ, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి, నియోజవర్గ నాయకులు మల్లోజు నాగార్జున చారి, బీజేపీ నాయకులు పాశం వేణుగోపాల్‌రెడ్డి, నియోజవర్గ నాయకులు కుప్పం పృథ్వీరాజ్, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు మాలె రవీందర్‌రెడ్డి.
బీజేపీ మోర్చా జిల్లా కార్యదర్శి అందుగుల ఆనంద్, బీజేపీ నియోజకవర్గ నాయకులు పాల్వాయి సైదులు, ముకాముల సైదులు, పాల్వాయి కొండల్, బీజేపీ మండల నాయకులు కత్తుల రమేశ్, ముకామల రమేశ్, సిరవోని మహేశ్, మేడి విఘ్నేశ్, మేడి సంజీవ, మారుపాక రాములు, కొండమీది సురేశ్, మూలసిరి యాదయ్య, షేక్ అమీర్ ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాదం సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖ బాధ్యులు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారు సైతం తిరిగి చేరుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో చౌటుప్పల్ నుంచి మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, ప్రస్తుత సర్పంచులు కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, పెద్దిటి హేమలతాచంద్రారెడ్డి, చిన్నం లావణ్యామల్లేశం, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు నరేశ్ బీఆర్ఎస్లో చేరారు. వీరితో పాటు నియోజకవర్గంలో ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు. మరి కొన్నిరోజుల్లో ఈ వలసలు మరింత పెరుగనున్నాయి.