నల్లగొండ, జూన్ 08 : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్స్కు చెల్లించాలని బిల్లులు సీరియల్ ప్రకారం చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(BAI) నేతల కోరారు. సోమవారం నల్లగొండలో బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 18న చలో హైదరాబాద్ పిలుపుపై చర్చించారు. బీఏఐ నేతలు ఎస్.ఎన్.రెడ్డి, డి.వి.ఎన్.రెడ్డి, సీహెచ్.శ్రీనివాసరావు, సంతోష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్.కృష్ణారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏఐ అనేది ప్రభుత్వానికి, కాంట్రాక్టర్స్ కు మధ్య వారధి అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017 వరకు మూడేండ్ల పాటు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ఉండేది. తర్వాత అది ఎత్తేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ సీరియల్ పాటిస్తారని ఆశించాం. కానీ పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా ఇష్టం వచ్చినట్లుగా బిల్లులు ఇస్తున్నారు. రూపాయి ఉంటే రెండు రూపాయల పనులు చేయించండి. కానీ 100 రూపాయల పనులు చేయించొద్దు. ఆర్ధిక పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని సీరియల్ ప్రకారం బిల్లులు ఇవ్వాలి. బిల్లులు రాక ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏ ప్రభుత్వమైన ప్రజల కోసమే పనులు చేశాం. గత ప్రభుత్వంలక్ష ఎస్డీఎఫ్ ద్వారా చేసిన పనులు చాలా ఉన్నాయి. ఈ పనుల బిల్లుల గురంచి ఎవ్వరిని అడగాలో చెప్పడం లేదు.
SDF లో 3- 4 వేల కోట్ల బిల్లులు ఉన్నాయి. ఇలాంటి వాటిపై తమతో చర్చించడానికి ఆస్కారం ఉంది. కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు కొన్ని వందల విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. అక్టోబర్ 2న గాంధీ విగ్రహాల వద్ద నిరసన తెలిపాం. రూ.20 వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉంటాయి. ఇచ్చే పేమెంట్స్ సీరియల్ ప్రకారం ఇవ్వొచ్చు. సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేకుంటే ఆ ప్రకారమే పనులు చేపట్టాలి. నాగర్ కర్నూల్ లో మూడు నెలల కిందట శ్రీనివాస రెడ్డి అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.10 కోట్ల బిల్లులు రావాలి. ఇప్పటికి ఆ బిల్లు మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని కోరారు.
ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. అప్ఘనిస్తాన్లో వర్క్స్ చేయొచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వాలు మానసికంగా చంపుతున్నాయి. అందరికీ దైర్యం చెప్పందుకే ఈ సమావేశం అన్నారు. ప్రభుత్వం ఆలోచించకుంటే ఈ మీటింగ్ లో తాము కఠినమైన నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వం తమ గురుంచి ఆలోచించాలన్నారు. 98 శాతం కాంట్రాక్టర్స్ పనులు చేయడం కోసం ఆస్తులు కుదవ పెట్టుకున్నారు. పడేండ్ల నుండి ప్రభుత్వం తమ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదన్న కారణంతో తమ బిల్లులు ఆపొద్దని పేర్కొన్నారు.