తానేదార్పల్లి వద్ద బస్సును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
బస్సును బైక్ ఢీన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గుర్రంపోడు మండలంలోని తానేదార్ పల్లి ఎక్స్ రోడ్ వద్ద సోమవారం జరిగింది. ఎస్ఐ ఎన్.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డి..
గుర్రంపోడు, మార్చి 30 : బస్సును బైక్ ఢీన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గుర్రంపోడు మండలంలోని తానేదార్ పల్లి ఎక్స్ రోడ్ వద్ద సోమవారం జరిగింది. ఎస్ఐ ఎన్.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డి (23) తన బైక్‌పై పనుల నిమిత్తం గుర్రంపొడుకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఆ సమయంలో దేవరకొండ నుండి నల్లగొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తానేదార్పల్లి ఎక్స్ రోడ్డు వద్ద అదుపుతప్పి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంజిరెడ్డి తండ్రి వడ్లపల్లి మణిపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

