కట్టంగూర్, నవంబర్ 24 : కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చిక్కు రంగయ్య జ్ఞాపకార్థం 4 సైకిళ్లను, 70 బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు లయన్స్ క్లబ్ కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఆర్ఓ ప్లాంట్ ద్వారా మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ అయితగోని నారాయణ, మాజీ ఎంపీటీసీ తవిడబోయిన భవాని, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి సాగర్, కల్లూరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, ట్రెజరర్ పోగుల రాములు, క్లబ్ సభ్యులు తవిడ బోయిన నరసయ్య, గోశిక ఉమాపతి, బొడ్డుపల్లి వెంకన్న, బజ్జూరి యాదయ్య, మంగదుడ్ల శ్రీనివాస్, జిల్లా ఉపేందర్, చిక్కు విజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.