కట్టంగూర్, ఏప్రిల్ 23 : ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం చారిత్రాత్మకమని, అది రైతుల భూములకు రక్షణ కవచంగా ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆధార్ కార్డులాగే రైతులకు భూ భారతి కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధుల ప్రమేయంతో తాసీల్దార్ కార్యాలయాల్లో భూ సమస్యల పరిష్కారంలో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుందని, అలా జరుగకుండా రెవెన్యూ అధికారులు చూసుకోవాలన్నారు. అనంతరం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా ప్రతి రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు అధికార వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. భూ భారతిలో అనుభవదారునికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో తలెత్తిన భూ సమస్యలను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఇందులో తప్పులు జరిగితే సంబంధిత అధికారులను ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్‌రావు, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్రావు, వ్యవసాయ అధికారి గిరిప్రసాద్, డిప్యూటీ తాసీల్దార్ సుకన్య, అర్ఐ కుమార్ రెడ్డి, మాజీ జడ్బీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీలు కొండ లింగస్వామి, రెడ్డిపల్లి వెంకటమ్మసాగర్, నాయకులు అయితగోని నారాయణ, అయితగోని నర్సింహ్మ, పెద్ది సుక్కయ్య, గడుసు శంకర్ రెడ్డి, గద్దపాటి దానయ్య, ముక్కాముల శేఖర్, పెద్ది యాదగిరి, మిట్టపల్లి శివ, మర్రి రాజు, పులిగిల్ల ఆంజనేయులు పాల్గొన్నారు.