నీలగిరి జనవరి 5 : స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పేరుతో పలు యాప్‌లను డౌన్లోడ్ చేయించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇలాంటి సంఘటన నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని తెలిపారు. ఒక బాధితుడితో సైబర్ నేరగాళ్లు సుమారు రూ.2 కోట్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించి, నకిలీ అధిక లాభాన్ని చూపించి మోసం చేశారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని చెప్పే మాటలు, పంపే మెసేజ్‌లు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఒక వేళ సంఘటన జరిగిన వెంటనే సైబర్ నేరాలపై 1930 నంబర్‌కు కాల్ చేయడం లేదా https://www. cyber crime.gov.in/ వెబ్సైట్లో నమోదు చేయడం లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.