పెన్‌పహాడ్, జనవరి 07 : ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. పార్టీ పిలుపు మేరకు పెన్‌పహాడ్ తాసీల్దార్ లాలు నాయక్‌కు బుధవారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే వారికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులతో పాటు చట్టపరమైన రక్షణ తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెన్‌పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య యాదవ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరహరి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యగ్గడి మురళి, జిల్లా నాయకులు మామిడి శోభన్ బాబు, యాదగిరి, రంగయ్య, మధు, ఉదయ్ పాల్గొన్నారు.