నల్లగొండ రూరల్, జనవరి 3: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు చదువులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ముందుగా విద్యార్థులతో భారీ ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ విడుదల చేయకపోవడం వారి చదువులకు ఆటంకంగా మారుతున్నదన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ అశోక్‌రెడ్డికి అందజేశామన్నారు. కార్యక్రమంలో మునాస ప్రసన్న, రమేశ్, పుట్ట వెంకన్న, రవీందర్, కీర్తి, శ్రీనివాస్, కృష్ణ, సతీష్, శివ, గిరి, గణేశ్ పాల్గొన్నారు.