నీలగిరి, జూన్ 28 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పోలీస్ శాఖకు సముచిత స్థానం కల్పించిందని బెటాలియన్స్ అదనపు డీజీ స్వాతి లక్రా అన్నారు. బుధవారం ఆమె నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడీషనల్ డీజీగా పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా నల్లగొండ బెటాలియన్ సందర్శించడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేసి బెటాలియన్‌కు మంచి పేరు తేవాలని కోరారు. రాష్ట్రంలో అన్ని బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కమాండెంట్ ఎన్వీ.సాంబయ్య అధ్వర్యంలో బెటాలియన్ మెయింటెనెన్స్ బాగు ందని, అదేవిధంగా నర్సరీలు, పార్కులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో 300మంది ఎస్పీటీపీసీలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకోసం గ్రౌండ్ సిద్ధం చేయడంతో పాటు క్లాస్‌రూమ్‌లు, కిచెన్లు, లైబ్రరీలు అందుబాటులోకి తేవాలన్నారు. అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. బెటాలియన్‌లో తరగతులు బోధించడం చాలా సంతోషకరమన్నారు. పాఠశాలను సైతం తమ వేల్ఫేర్ తరపున చూసుకుంటామని తెలిపారు. బెటాలియన్ పోలీసులు అన్ని రకాల డ్యూటీలు చేస్తూ సమాజానికి సేవ చేస్తారని కొనియాడారు. విధులపై ఎలాంటి అలసత్వం ఉండరాదని, క్రమశిక్షణతో సిబ్బంది ఉండాలని సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. అనంతరం బెటాలియన్‌లో చిల్డ్రన్స్ పార్కు, ఫిష్ పాండ్, ఎంటీ కార్యాలయాలను ప్రారంభించారు. యోగా, పిల్లల కోసం డ్యాన్స్ మాస్టర్‌ను ఏర్పాటు చేస్తానని హమీనిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ కె.అపూర్వరావు, బెటాలయన్ కమాండెంట్ ఎన్వీ.సా ంబయ్య, హౌసింగ్ బోర్డు ఈఈ, అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి, నర్సింగు వెంకన్న, శర్మిలాదేవి, ఆర్ఐలు కృష్ణార్జున్, వెంకటేశ్వర్లు, రాజు, అశోక్, యుగంధర్, వెంకన్న, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.