భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడిలో భాగంగా నిర్ధేశించిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను సత్వరమే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ తెలిపారు. గురువారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ వసతుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు దేవసేనా మన ఊరు-మన బడిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
జిల్లాలో 251పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతున్నదన్నారు. రూ.30 లక్షల లోపు పనుల కోసం 225 పాఠశాలలను, రూ.30 లక్షలకు పైగా ఖర్చు అయ్యే పనుల కోసం 26 పాఠశాలలను గుర్తించినట్లు చెపారు. డీఈఓ నారాయణరెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ శంకరయ్య, పంచాయతీరాజ్ శాఖ ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.