నేడు హుజూర్‌నగర్‌లో బంజారా భవన్ ప్రారంభం
హుజూర్‌నగర్‌లో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మితమైన బంజారా భవన్ బుధవారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా ఉదయం 11.15 గంటలకు భవనం ప్రారంభం కానుంది.
- ప్రారంభించనున్న మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి
- గిరిజనులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే శానంపూడి పిలుపు
నేరేడుచర్ల/హుజూర్నగర్, ఫిబ్రవరి 21 : హుజూర్‌నగర్‌లో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మితమైన బంజారా భవన్ బుధవారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా ఉదయం 11.15 గంటలకు భవనం ప్రారంభం కానుంది. హుజూర్నగర్ పట్టణానికి అత్యంత సమీపంలో గల రామస్వామి గుట్టల మధ్యలో ఎకరా విస్తీర్ణంలో రూ.కోటిన్నర వ్యయంతో భవనం రూపుదిద్దుకుంది. ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో 67 గిరిజన తండాలు ఉండగా జనాభా 60 వేలకు పైగా ఉంది. దీంతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులను మంజూరీ చేయించి ఒకేసారి 3 వేల మంది గిరిజనులు కూర్చునేలా బంజారాభవన్‌ను నిర్మించారు. దీంతో ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత గిరిజనుల కల నెరవేరినట్లయింది.
మంత్రుల పర్యటన ఇలా
పట్ణణంలోని బంజారాభవన్ ప్రారంభం అనంతరం అదే ప్రాగణంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో మంత్రులు పాల్గొననున్నారు. అనంతరం మేళ్లచెర్వులోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్ర స్థాయి ఎద్దుల పందేలను వీక్షించనున్నారు.
మంత్రుల రాకను విజయవంతం చేయండి
పట్టణంలోని బంజారాభవన్ ప్రారంభంతో పాటు సంత్ సేవాలాల్ వేడుకలో పాల్గొననున్న మంత్రులు సత్యవతిరాథోడ్, జగదీశ్‌రెడ్డిల పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా గిరిజన సోదరులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో పనులు ఒకొక్కటిగా పూర్తి అవుతున్నట్లు తెలిపారు. నేడు బంజారాభవన్ ప్రారంభంతో గిరిజనుల దశాబ్దాల కల నెరవేరినైట్లెందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అందుకు ముందు ఎమ్మెల్యే రామస్వామి గట్టు వద్ద మంత్రుల సభ ఏర్పాట్లను హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో హుజూర్నగర్, మఠంపల్లి జడ్పీటీసీలు సైదిరెడ్డి జగన్నాయక్, మాజీ ఎంపీపీ కొండానాయక్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, నేరేడుచర్ల ఎంపీపీ జ్యోతి, మున్సిపల్ చైర్మన్ జయబాబు, పట్టణ, మండలాధ్యక్షుడు శ్రీలత, సురేశ్, నగేశ్, దొంతిరెడ్డి పద్మ, దీప నవీన్‌నాయక్, చంద్రమౌళి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

