Tungaturthi | తుంగతుర్తి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళకు, వృద్దులకు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని అన్నారు. బండరామారం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు చేపట్టిన ధర్నాలో బీఆర్ఎస్ నేత గుండగాని రాములు గౌడ్ పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీళ్లు లేక యాసంగి పంట ఎండి పోయి రైతుల గుండె పగిలి ఏడుస్తుంటే ప్రభుత్వ పెద్దలు సభలు జరుపుకుంటూ సంబరాలుచేస్తున్నారని ఎద్దెవా చేశారు. పంట ఎండిన పొలానికి ఏమి నష్ట పరిహారం ఇస్తారో ఈ రోజుసభలో మంత్రులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తే రేవంత్ రెడ్డి పాలనలో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసిన మా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు గుండాగానీ రాములుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ పులుసు ఇందిర ఉప్పలయ్య, కోడెదాల బక్కయ్య, కోటమర్తి సైదులు, అకారపు భాస్కర్, డీలర్ ఉప్పలయ్య, ఎల్లమ్మ, అనసూర్య, గడ్డం సోమయ్య, పులుసు బక్కయ్య, జటంగి బక్కయ్య, సోమనరసయ్య, మంగమ్మ, రమేష్, బిక్షం, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.