సూర్యాపేట టౌన్, జూలై 16: సీఎం రేవంత్‌రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొరికిన నువ్వు నికార్సైన ఉద్యమ నేత పేదల పక్షాన పోరాడే నాయకుడు జగదీశ్‌రెడ్డిపై నిందారోపణలు చేయడం నీ నీతిమాలిన చర్యకు నిదర్శనమన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కో దాడ ప్రాంతాలకు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి చెరువులు, కుంటలు నింపి దేశంలోనే అత్యధిక దిగుబడి సాధించి ప్రతి గిం జకూ మద్దతు ధర ఇచ్చిన ఘనత జగదీశ్‌రెడ్డిదే అన్నారు. రెండేండ్లుగా కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుం డా పంటలను ఎండబెట్టి వ్యవసాయాన్ని నాశనం చేసిన దుర్మార్గులు మీరని పేర్కొన్నారు. తుంగతుర్తిలో 30ఏఁడ్ల హత్యారాజకీయాలతో సమాధులు మిగిల్చారని, నేడు మీ పాలన చూసి వీరి కోసమా మేము చనిపోయిందని వారి ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు.
వేలకోట్లతో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసి సాగు, తాగునీరు, మౌలిక వసతులు అందించిన ఘనత జగదీశ్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చే లా కాకుండా విలువ దిగజార్చేలా మాట్లాడడం నీకు మాత్రమే సాధ్యమవుతుందని, నీలా ఎత్తు పొడుగున్న జిల్లా నాయకులు కుటుంబ పాలన సాగించి ప్రజలను దోచుకున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు, యాదాద్రి పవర్ ప్లాంట్, కాళేశ్వరంతో చివరి పం టలకు నీళ్తు అందించిన నాయకుడు జగదీశ్‌రెడ్డి అన్నారు. ఫ్లోరిన్తో వయసు మీద పడి కాళ్లు, చేతులు వంకర్లు పోతే కేసీఆర్‌తో మాట్లాడి స్వచ్ఛమైన మిషన్‌భగీరత నీరు అందించి ఫ్లోరిన్ రహిత జిల్లాగా కేంద్రంలో అవార్డు అందుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి చేసిన అభివృద్ధిలో మీరు ఒక శాతమైన చేసి ఉంటే ఎవరి అభివృద్ధి ఎంతో తేల్చుకుందామని సవాల్ విసిరారు. నువ్వు కొత్తగా రేషన్‌కార్డులు ఇస్తున్నానని గొప్పలు చెబుతున్నావని మేము 2021లోనే ఇచ్చామని అందుకు సంబంధించి అన్ని ఆధానాలను మా నాయకుడు జగదీశ్‌రెడ్డి మీడియాకు తెలిపారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ప్రజా ప్రతినిధులు సుంకరి రమేశ్, బత్తుల రమేశ్, మడిపల్లి విక్రమ్, తూడి నర్సింహారావు, బత్తుల ప్రసాద్, రేణుబాబు, మద్ది శ్రీనివాస్, దొండ శ్రీను తదితరులు ఉన్నారు.