రామన్నపేట, జూన్ 29 : జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విషం చిమ్ముతూ, వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య తండ్రి బుగ్గయ్య అనారోగ్యంతో మృతి చెందగా మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం జర్నలిజం కాదన్నారు. జర్నలిజం ముసుగులో వ్యక్తిగతంగా విషం చిమ్మడం దుర్మార్గమన్నారు. దురుద్దేశపూర్వకంగా కేటీఆర్‌పై అసత్య వార్తలు ప్రచారం చేసిన ఛానల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోశపోయిన మల్లేశం, రైతు సమస్యయ సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క చూదవరెడ్డి. నాయకులు కన్నెబోయిన బలరాం, జెట్టి సైదులు, నడిగోటి కృష్ణ, వంగాల యాదయ్య, నక్క సరేందర్, సింగం మల్లేశం, వల్ల సైదులు పాల్గొన్నారు.