చండూరు, ఏప్రిల్ 05 : దళిత జాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని మాదిగ సంఘాల నాయకుల ఐఖ్య వేదిక కో-ఆర్డినేటర్ అన్నెపర్తి యాదగిరి అన్నారు. శనివారం జగ్జీవన్ రామ్ జయంతిని చండూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్, రాష్ట్ర దళిత నాయకుడు అన్నెపర్తి శేఖర్, మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకుడు కురుపాటి సుదర్శన్ ముఖ్య అతిథులుగా పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన బాబూజీ ఎన్ని అవమానాలు ఎదురైనా దళిత జాతి అభివృద్ధి కోసం, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని కొనియాడారు. స్వతంత్ర్య భారతంలో కేంద్ర మంత్రిగా, తొలి ఉప ప్రధానమంత్రిగా సేవలందించినట్లు తెలిపారు. జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మాదిగలు ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో పనిచేస్తున్నా జాతి ప్రయోజనాల కోసం సమిష్టిగా, ఐఖ్యతతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఇరిగి ఆంజనేయులు, ఇరిగి దుర్గా ప్రసాద్, ఇరిగి లక్ష్మయ్య, ఆకారపు యేసు, ఇరిగి శంకర్, అన్నెపర్తి వెంకటేశం, ఇరిగి చరణ్, తరి సురేశ్, ఇరిగి రామకృష్ణ, పెరిక శంకర్, ఎల్వర్తి జగన్, గంటెకంపు అశోక్, ఇరిగి ప్రశాంత్, బుషిపాక శంకర్, మొండికత్తి నరసింహ, కురుపాటి యాలాద్రి, ఆకారపు గణేశ్, పొట్టిపాక శ్రీను, బుషిపాక నగేశ్, దుబ్బ విజయ్, అన్నెపర్తి ప్రవీణ్, కొమ్ము గణేశ్, ఇరిగి శివ, ముత్తయ్య, లోకేశ్, సిద్ధార్ధ పాల్గొన్నారు.