రామగిరి, డిసెంబర్ 1: ఫీజు రీయింబర్స్మెం ట్ విడుదలలో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్మెంట్తో మాకు సంబంధం లేదు. నవంబర్ 29లోగా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిందేనం టూ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 26నుంచి బీటెక్ 3వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని ముందస్తుగానే షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ వాటిని వీసీ, రిజిస్ట్రార్ ఆదేశాలతో వాయిదా వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గతంలో సిలబస్ కాలేదని, కాస్తా సమయం ఇస్తూ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లు, వీసీ, రిజిస్ట్రార్లను వేడుకున్నా…స్పందించని వారు ఏకంగా ట్యూషన్ ఫీజుల విషయంలో పరీక్షలను వాయిదా వేశారంటే ఓ వైపు ప్రభుత్వం..మరో వైపు యూనివర్సిటీ అధికారులు పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతున్నారనేది స్పష్టమవుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశతో యూనివర్సిటీల్లో చేరితే ప్రభుత్వంతో సంబంధ లేదు.
ట్యూషన్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తేస్తుండటంతో వేల రూపాయాలు చెల్లించలేక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యూషన్ ఫీజుల విషయం ఆలస్యంగా బయటకు రావడంతో వివరణ కోసం ఫోన్లో సంద్రించాలని ప్రయత్నం చేస్తే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల రవి ఫోన్ స్వీచ్ ఆఫ్ అని వచ్చింది. అయితే యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ రింగ్ అయినప్పటికీ స్పందించ లేదు.