చివ్వెంల : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం గ్రామానికి చెందిన అజహరుద్దీన్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కాశీం పర్యవేక్షణలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన ‘తెలంగాణ రచనలు వస్తురూప వైవిద్యం’ అనే అంశంపై పరిశోదన చేసినందుకు డాక్టరేట్ వచ్చినట్టు అజహరుద్దీన్ శనివారం తెలిపారు.
అజహరుద్దీన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మైనార్టీ గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అజహరుద్దీన్‌కు డాక్టరేట్ దక్కడంపట్ల బంధుమిత్రులతోపాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.