– హాజరు కానున్న 700 మందికి పైగా ఆటగాళ్లు, 50 మంది పైగా కోచ్‌లు
– ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ డెక్కన్ చార్జర్స్ ఆటగాడు డీబీ.రవితేజ
రామగిరి, జూన్ 04 : తెలంగాణ క్రికెట్ రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఎల్) గుర్తింపుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘టిజి-20’ ప్రీమియర్ లీగ్ సరికొత్త సంచలనానికి సిద్దమైంది. 2026 సీజన్లో పాల్గొంటున్న 8 ప్రముఖ ప్రాంచైజీలలో ఒకటైన నల్లగొండ నైట్స్ కన్స్ను ప్రధాన స్పాన్సర్‌గా “అనురాగ్ యూనివర్సిటీ” ఆ శాఖల మాజమన్యం కిశోర్ ఇన్‌ఫ్రాలు సంయుక్తంగా జిల్లాలోని గ్రామీణ క్రీడాకారుల్లో క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకై వేదికపై నిలబెట్టేందుకు నడుం బిగించింది. దీనికి ఈ నెల 5న (శుక్రవారం) జిల్లా కేంద్రంలోని ‘ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్’ లో యువ క్రికెటర్స్, కోచ్‌ల కోసం ఉదయం 10:30 గంటలకు భారీ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు.
నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి పట్టణాలోని 50కి పైగా క్రికెట్ అకాడమీలను సంప్రదించి ఆటగాళ్లు, కోచ్‌లతో ఇప్పటికే నిర్వహించిన సమావేశాలలోని అంశాల ఆధారంగా ఈ సదస్సులో యువ ఆటగాళ్ల భవిష్యత్ కార్యాచరణపై పూర్తిగా అవగాహన కల్పించి ‘టిజి-20’లీగ్ నిర్వహణ తీరు తెన్నులు, ఆటగాళ్ల ఎంపిక తదితర అంశాలతో ‘నల్లగొండ నైట్స్ విజన్’ను పరిచయం చేయనున్నారు. యువ క్రికికెట్స్ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రాంచైజీ యజమానులు, స్పాన్సర్లతో నేరుగా సంభాషించి తమ అంతర్జాతీయ కలలను నిజం చేసుకోవాలని నిర్వహకులు పిలుపునిచ్చారు.
సదస్సులో అనురాగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్ జట్టు ప్రాధన్యత వహించిన ప్రముఖ మాజీ క్రికెటర్ డిబి. రవితేజ హాజరై ప్రసంగించి దిశానిర్ధేశం చేయనున్నారు. దీనిలో రాబోయే నాలుగేళ్లలో నల్లగొండ నైట్స్, అనురాగ్ యూనివర్సిటీ సంయుక్తంగా తెలంగాణ క్రికెట్ అభివృద్ధికి చేపట్టబోయే రోడ్ మ్యాప్‌ను వారు వివరించనున్నారు. ఈ సమావేశానికి 700 మందికి పైగా యువ క్రికెటర్లు, 50 మందికిపైగా కోచ్‌లు హాజరవుతున్నారు. ప్రతిభావంతంమైన ఆటగాళ్లను, ఉత్తమ అకాడమీలను గుర్తించి ఉచిత ప్రత్యేక శిక్షణ, అడ్వాన్స్డ్ కోచించ్, మార్గదర్శకత్వం అందించి తదుపరి టిజి-20 సీజన్లలో ఆడేలా ప్రోత్సాహం ఇవ్వనున్నారు. కావునా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.