ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన
ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఐఎంఏల సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలోని నర్సులు, టెక్నీషియన్లు అలాగే పారా మెడికల్ సిబ్బంది సిబ్బందికి బుధవారం ఐకాన్ ఆస్పత్రిలో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
నీలగిరి, జూలై 22 : ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఐఎంఏల సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలోని నర్సులు, టెక్నీషియన్లు అలాగే పారా మెడికల్ సిబ్బంది సిబ్బందికి బుధవారం ఐకాన్ ఆస్పత్రిలో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐకాన్ ఆస్పత్రి ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా.రవిశంకర్ కన్నా, డా.సాయి మౌనిక చెరుకూరి, డా.సాయి లావణ్య కడిమి, డా. త్రిశూల్‌రెడ్డి గుండెపోటు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్ విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుండె ఆగిపోయిన తర్వాత మొదటి 4 నుండి 6 నిమిషాల్లో సీపీఆర్ ఇవ్వడం ద్వారా మెదడు దెబ్బతినకుండా రోగి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సీపీఆర్ సమయంలో జరిగే సాధారణ తప్పులు, పిల్లలు, పెద్దలకు వేరుగా ఇచ్చే పద్ధతుల గురించి నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ హాస్పిటల్ వైద్య బృందం, ఐఎంఏ సభ్యులు, సీఎస్ఐ సభ్యులు, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 200కి పైగా ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

