తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆవుల రామారావు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి, జైలు జీవితం అనుభవించిన ఆవుల రామారావుకు ఉద్యమకారుల ఫోరంలో కీలక బాధ్యతలు దక్కాయి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామారావు నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు...
కోదాడ, మే 29 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి, జైలు జీవితం అనుభవించిన ఆవుల రామారావుకు ఉద్యమకారుల ఫోరంలో కీలక బాధ్యతలు దక్కాయి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామారావు నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నియామక పత్రాన్ని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుండెపంగు రమేశ్ చేతుల మీదుగా శుక్రవారం కోదాడ పబ్లిక్ క్లబ్లో రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా గుండెపంగు రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ఫోరం అండగా ఉంటుందన్నారు. ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన వారికి మద్దతుగా నిలుస్తూ, ఉద్యమకారులందరినీ ఐక్యం చేసి వారి శ్రేయస్సు కొరకు పాటుపడాలని కోరారు.
అనంతరం నూతన ఉపాధ్యక్షుడు ఆవుల రామారావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి, అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు, తుపాకుల. భాస్కర్, నియోజకవర్గం నాయకులు ఏనుగుల ఏలేశ్వరావు, మట్టపల్లి శ్రీనివాస్, మునగాల మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు పొలంపల్లి వెంకటేశ్వర్లు, కోదాడ మండల అధ్యక్షుడు కొల్లూరి. వెంకటేశ్వర్లు, అనంతగిరి మండల అధ్యక్షుడు సైదులు నాయక్, రాష్ట్ర నాయకులు అజాహార్, కొత్త శ్రీనివాస్, కుడుముల రాంబాబు, గుండెపంగు రవి, కుడుముల శివ, రజిని, తమలపాకుల సైదులు, పాస్టర్ దానియేలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

