కట్టంగూర్, జూన్ 8 : పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సోమవారం కట్టంగూర్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రెడ్ యూనియన్ నాయకలు ఆకునూరి స్టాలిన్ మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో కుటుంబ పోషణ కష్టతరంగా మారిందన్నారు. ఆటో చార్జిలను పెంచేందుకు అధికారులు అనుమతించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కట్టంగూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు దాసరి కిరణ్, ఉపాధ్యక్షులు మేడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు పెందోటి నగేష్, కోశాధికారి దాసరి ప్రవీణ్, కార్యదర్శి కోనేటి వెంకన్న, సలహాదారులు చెరుకు వెంకన్న, నాగరాజు, నవీన్, కానుగు రాంబాబు, మేడి సురేష్, గుండు నరేష్, మద్దెల శివకుమార్, మేడి కృష్ణ, అంతటి రమేష్, రత్నం యాదయ్య, ఊట్కూరి ప్రభు తదితరులు పాల్గొన్నారు