దేవరకొండ రూరల్, మే 27 : దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఈ నెల 28న బుధవారం ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కార్యాలయ ప్రాంగణంలో జరిగే ఈ వేలం పాటకు ఆసక్తి గలవారు బైక్లకు రూ.10 వేలు, నాలుగు చక్రాల వాహనం కోసం రూ.30 వేల ధారావత్ చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. వాహనం దక్కించుకోని వారికి డిపాజిట్ తిరిగి చెల్లించనున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం 8 గంటలకు ధరావత్ అమౌంట్ చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.