కట్టంగూర్, నవంబర్ 12 : విద్యార్థినుల ఆరోగ్యం పట్ల పాఠశాల శ్రద్ధ వహించాలని కట్టంగూర్ మండల ప్రత్యే అధికారి జి.సతీశ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధిలో గల్ల చిన్నపురిలోని మహాత్మా జ్యోతీరావ్ పూలే బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా ఉంటారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారిని ప్రణాళికయుతంగా చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు, ఎంపీఓ స్వరూపారాణి, ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వైద్యురాలు శ్వేత, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.