సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 03 : పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యా దగా ప్రవర్తిస్తూ వారికి భరోసా కల్పించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ సిబ్బందికి సూచించారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ శుక్రవా రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డ్స్, ఫిర్యాదుల నిర్వహణ, కమాండెంట్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందిస్తూ బాధితుల వద్ద నుండి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పు డు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
పోలీస్ సిబ్బంది జట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ రోప్ సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, ఐలయ్య, మహేందర్నాథ్, శివతేజ పాల్గొన్నారు.