నందికొండ, ఫిబ్రవరి 06 : పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ను శుక్రవారం భారత్ దర్శన్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్లు విపిన్, రామవతార్ గుప్తా ఆధ్వర్యంలో సందర్శించారు. వారం రోజులుగా హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో వీరు శిక్షణ పొందుతున్నారు. సాగర్ చేరుకున్నఈ బృందానికి నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అశోక్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వీరు నాగార్జునసాగర్ డ్యాం ను, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధ వనంలో బుద్దవనం విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన వీరిచే మహాస్తూపం లోని ధ్యాన మందిరంలో ధ్యానం చేయించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్, బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరితో పాటు సాగర్ ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి, ప్రోగ్రాం డైరెక్టర్ డి.వెంకటరమణ, కో ఆర్డినేటర్ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.