తుంగతుర్తి, ఏప్రిల్ 25 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల వర్షం వ్యక్తం చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం మండల ఆర్య వైశ్యుల సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి, సీఎం రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర పండుగగా వాసవి మాత జయంతిని గుర్తించడం ఎంతో శుభపరిణామం అని ఆర్యవైశ్యులు అన్నారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికను గౌరవించినందుకు సీఎం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం నాయకులు ఈగ నాగన్న, ఓరుగంటి అంతయ, తాటికొండ సీతయ్య, పోలవరపు సంతోష్, ఈగల లక్ష్మయ్య, శరీరాల మల్లయ్య, బుద్దా వీరన్న, మాశెట్టి వెంకన్న, గోపారపు సత్యనారాయణ, గుండా శ్రీనివాస్ బండారు నాగన్న, తల్లాడ శ్రీను, ఓరుగంటి సుభాష్, ఓరిగంటి శ్రీను, తల్లాడ చుక్కయ్య, ఈగ సోమయ్య, రామ నరసయ్య పాల్గొన్నారు.