కోదాడ, డిసెంబర్ 27 : ఆర్యవైశ్యులు వ్యాపార రంగాల్లోనే కాకుండా రాజకీయంగానూ చైతన్యవంతులు కావాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల నియామకమైన ఎర్ర శ్రీనివాస్ ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండి పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆర్యవైశ్యులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఫెడరేషన్ నిత్యం పనిచేస్తుందన్నారు. వైశ్యుల సంక్షేమం కోసం ఐవిఎఫ్ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎర్ర శ్రీనివాస్ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల శ్రీనివాస్ గుప్తాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పైడిమరి సత్తిబాబు, నారాయణరావు, వెంకటనారాయణ, ఓరుగంటి ప్రభాకర్, నీలా సత్యనారాయణ, ఇమ్మడి రమేష్, రాయపూడి వెంకటనారాయణ, వెంపటి మధు, ఓరుగంటి కిట్టు, కుక్కుడపు బాబు, యాద సుధాకర్, అశోక్,పందిరి సత్యనారాయణ, చల్లా ప్రకాష్ పాల్గొన్నారు.