నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్9(నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ చలో హైదరాబాద్కు వెళ్తున్న మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో తరలివెళ్లకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి నిఘా పెట్టారు. నల్లగొండ, మిర్యాలగూడ, కనగల్, చండూరు, మాడ్గులపల్లి, నాంపల్లి, పెద్దవూర, త్రిపురారం, నిడమనూర్, దేవరకొండ, హాలియా, నకిరేకల్, కట్టంగూరు, మునుగోడు తదితర మండలాల్లో మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల, పెన్పహాడ్, నేరేడుచర్ల, గరిడేపల్లి, మోతె, చిలుకూరు, తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, నూతనకల్.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, గుండాల, సంస్థాన్నారాయణపు రం, భూదాన్ పోచంపల్లి, రాజాపేట తదితర మండలాల్లో మాజీ సర్పంచులను అరెస్ట్ చేశారు. చలో హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు తేల్చిచెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుం డా రాజధానిలో ఆందోళనలు చేపడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.