నల్లగొండ, నవంబర్ 26 : నల్లగొండ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 5 నుండి 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులు అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్సీడీడీ డిప్యూటీ డైరెక్టర్ శశికళ అన్నారు. ఫ్రెష్ అలాగే రెన్యువల్ విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థిని విద్యార్థలచే దరఖాస్తు చేయించాలని కోరారు. దరఖాస్తు సమయంలో విద్యార్థులు కులం, ఆదాయం, ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాస్‌ఫొటో సమర్పించాల్సి ఉంటుందన్నారు.