Nallagonda | నల్లగొండ, జూన్ 22 : జిల్లా పశుగణాభివృద్ది సంస్థలో కాంట్రాక్టు పద్దతిలో పని చేసేందుకు సూపర్వైజర్ పోస్టు ఖాళీగా ఉందని.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఈవో రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెటర్నరీ పాలిటెక్నిక్, డిప్లొమా, డెయిరీ సైన్స్ లేదా గోపాల మిత్రగా పనిచేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18 నుండి 40 సంవత్సరాల వయసు ఉండటంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆసక్తి కలిగి అర్హులైన వారు ఈ నెల 26వ తేదీలోపు జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో ఉన్న డీఎల్డీఏ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని, ఇతర వివరాలకు 85230 23423నెంబర్ను సంప్రదించాలని అన్నారు.