రామగిరి, జూన్ 27 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు అయిన లా కళాశాల ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం కానున్న దృష్ట్యా అధ్యాపకుల ఎంపికకు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. పార్ట్ టైం అధ్యాపకులు ఎల్.ఎల్.బి, ఎల్ ఎల్ ఎం విభాగాలలో, ఫ్యామిలీ లా, కానిస్టిట్యూషన్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, లా ఆఫ్ టార్ట్, లా ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా స్పెషలైజేషన్‌లో ఎంపికలు జరగనున్నాయి. ఎల్ ఎల్ ఎం లో కనీసం 60 శాతం మార్కులతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయాల నుండి సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్డీ అలాగే బోధన అనుభవంతో కూడిన అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 10న 4 గంటల లోపు రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలిపారు.