త్రిపురారం, మే 31 : త్రిపురారం మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల పాఠశాలలో 1 నుంచి 5వ తరగతిలో ప్రవేశాల కోసం గిరిజన బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ప్రాంతీయ సమన్వయకర్త ఇ.బలరాంనాయక్, పాఠశాల హెచ్ఎం వై.భారతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30 సీట్లు, 2వ తరగతిలో 14 సీట్లు, 3వ తరగతిలో 6 సీట్లు, 4వ తరగతిలో 4 సీట్లు, 5వ తరగతిలో 10 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.
ఆసక్తిగల విద్యార్థులు జూన్ 6వ తేదీ లోపు దరఖాస్తులతో పాటు ఆధార్, రేషన్‌కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను పాఠశాలలో అందచేయాలని సూచించారు. ఎంపికలో సొంత మండలానికి చెందిన వారికే ప్రాధాన్య ఇవ్వనున్నట్లు తెలిపారు. 9వ తేదీ ఉదయం 10 గంటలకు లాటరీ పద్దతిలో విద్యార్థుల ఎంపిక ఉంటుదని, తుది జాబితాను 10వ తేదీ ఉదయం పాఠశాల నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంచుతామన్నారు. ఇతర వివరాలకు 9491030267 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.