నిడమనూరు, జూన్ 11 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో గల కస్తూర్భా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో తాత్కాలిక పద్ధతిలో విద్యాబోధన చేసేందుకు మండలంలో అర్హులైన మహిళా అభ్యర్ధులు ఈ నెల 16వ తేదీ లోగా ధరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ ఎల్.వెంకన్న, ప్రత్యేకాధికారి పద్మారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గాను సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడించారు.