గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు
సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి.భానునాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 8 పోస్టులకు నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సూర్యాపేట అర్బన్, అక్టోబర్ 7 : సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి.భానునాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 8 పోస్టులకు నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి పీజీలో 50శాతం కనీస విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. మెరిట్ ప్రాతిపదికన నియామకం జరుగుతుందని, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 7నుంచి 10 సాయంత్రం వరకు సూర్యాపేట డీఐఈఓ కార్యాలయంలో ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తున్నట్లు దరఖాస్తు వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, కులం, స్టడీ, స్థానికత ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నా రు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకానిమిక్స్, తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఎంపీహెచ్ఓడబ్ల్యూ, కోదాడ ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో ఇంగ్లిష్, కెమిస్ట్రీ, నేరేడుచర్ల ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఏసీపీ కోర్సు, మ్యాథ్స్, హుజూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ సబ్జెక్టులకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

